
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవివకి రాజీనామా చేయాలని మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తే ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామని సవాల్ విసిరారు. హుజూరాబాద్ లో ఈటల పరోక్షంగా విమర్శలు చేసిన నేపథ్యంలో కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల మాట్లాడారు. పదవుల కోసం పెదవులు మూయను అని చెప్పిన ఈటల కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసినా పదవి పట్టుకుని ఊగుతున్నారని అన్నారు. ఆది ఆత్మగౌరవమా ఆత్మ వంచనా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని కమలాకర్ అన్నారు.