
అత్యంత కీలకమైన రెండు మీడియా సంస్థలపై ఇన్ కమ్ టాక్స్ సోదాలు జరుగుతున్నాయి. ప్రఖ్యాత హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రముఖ టెలివిజన్ ఛానెల్ భారత్ సమాచార్ పై ఐటీ సోదాలు చేపట్టింది. దైనిక్ భాస్కర్ పత్రికకు చెందిన 35 లొకేషన్లలో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని దైనిక్ భాస్కర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.