
సీఎం జగన్ కు 151 సీట్లు ఇవ్వడం ప్రజల దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ లోపభూయిష్టమైన పన్ను విధానం వెంటనే రద్దు చేయానలి డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ప్రజలపై ఆస్తి పన్ను భారం దారుణమన్నారు. ప్రభుత్వం ఆస్తులు తాకట్టుపెట్టి డబ్బులు తీసుకురావాలనే ప్రభుత్వాలోచన పనికిమాలిన చర్య అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు.