
సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుత కరోనా నేపథ్యంలో తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో అంశం పై స్పందించారు. ఒక ధనవంతుడు తన పనిని చేయటానికి చూసుకోవచ్చు. తన కారును నడిపేందుకు వేరే వ్యక్తిని నియమించుకోవచ్చు. ఇంకో వ్యక్తిని తన సేవకుడిగా పొందవచ్చు. కానీ అతడు అనారోగ్యానికి గురైతే తన జబ్బును ఇతర వ్యక్తికి ఇవ్వలేడన్నారు. ఇందులో నీతి ఏంటంటే మీరు ఎంత ధనవంతులైన కావోచ్చు.. మీ అనారోగ్యాన్ని మీరే భరించాలి.. మీ చావు మీరే చావాల్సి ఉంటుందని వర్మ పేర్కొన్నారు.