
నెల్లూరుజిల్లా లో ఆక్సిజన్ కొరత తో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. జీజీహెచ్ మొదటి అంతస్తుతో ఉన్న రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా వెల్లడించ లేదు. గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ లభించక ఐదు రోజుల్లో ఐదుగురు మరణించారు. నిన్నటి నుంచి ఆక్సిజన్ కొరత కారణంగా పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోని రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.