పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత.. రెబల్ స్టార్ రేంజ్ హైరేంజ్ కు చేరిపోయింది. దీంతో.. ప్రభాస్ సినిమాల కోసం ఎదరు చూసేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం.. ఫ్యాన్స్ కు మొత్తం నాలుగు సినిమాలు బాకీ ఉన్నాడు ప్రభాస్. ఇందులో మొదటగా రావాల్సింది రాధేశ్యామ్.
ఎప్పుడో రావాల్సిన ఈ సినిమాకు కరోనా అడ్డుగా నిలిచింది. ఇప్పుడు రెండోసారి కూడా ఎదురు నిలిచింది. దీంతో.. ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఏవీ సకాలంలో పూర్తయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ చిత్రం 80వ దశకం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
దీంతో.. ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరిపారు. కానీ.. మొత్తం సెట్స్ లోనే సాధ్యం కాదుకాబట్టి.. సీజీ వర్క్ మీదనే ప్రధానంగా ఆధారపడాల్సి వచ్చింది యూనిట్. డబ్బులు ఖర్చు చేస్తే ఎలాంటి వర్క్ అయినా ఇబ్బంది లేదు. కానీ.. సమస్య ఏమంటే.. ఈ వర్క్ ను విదేశాల్లోని కంపెనీలకు అప్పగించారు.
అయితే.. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఆ వర్క్ సరిగా సాగట్లేదట. ఆయా కంపెనీలు.. ఆఫీసులు మూసేసి, వర్క్ ఫ్రమ్ డ్యూటీ వేశాయట. కో-ఆర్డినేషన్ పర్ఫెక్ట్ గా లేకపోవడంతో.. పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయట.
అందువల్ల అనుకున్న సమయానికి వీఎఫ్ ఎక్స్ వర్క్ కంప్లీట్ కావడం సాధ్యం కాదని చెబుతున్నారు. దీంతో.. ఈ సినిమా జూన్ లో కాదుగదా.. దసరాకు రావడం కూడా కష్టమేనని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.