Homeక్రీడలుSRH captaincy debate : అభిషేక్ శర్మ కాదు.. సన్ రైజర్స్ కు కెప్టెన్ కావాల్సింది...

SRH captaincy debate : అభిషేక్ శర్మ కాదు.. సన్ రైజర్స్ కు కెప్టెన్ కావాల్సింది అతడే! కావ్య కు ఎవరైనా చెప్పండయ్యా..

SRH captaincy debate : మిగతా టోర్నీలను పక్కన పెడితే.. ఐపీఎల్ లో కెప్టెన్ పాత్ర చాలా ప్రముఖమైనది. ఎందుకంటే కెప్టెన్ తీసుకునే నిర్ణయాలే జట్టు విజయాలను ప్రభావితం చేస్తాయి. అందువల్లే అన్ని జట్లు కెప్టెన్ నియామకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తర్వాతే కెప్టెన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాయి. అయితే హైదరాబాద్ జట్టు విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎందుకో నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

వెన్నునొప్పి వల్ల కెప్టెన్ కమిన్స్ ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. అతడి స్థానంలో అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం దాదాపుగా నిజమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే హైదరాబాద్ జట్టు కు అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ జట్టులో అద్భుతమైన ఆటగాడు ఇషాన్ కిషన్ ఉన్నాడు. అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించాడు. నాయకత్వం మాత్రమే కాదు, ఆ జట్టును విజేతగా కూడా నిలిపాడు. అలాంటప్పుడు.. హైదరాబాద్ జట్టు బాధ్యతలను కిషన్ కు ఇస్తే బాగుంటుందని ప్రచారం జరుగుతుంది.

కిషన్ ఇటీవల జరిగిన టి20 వరల్డ్ కప్ లో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో అయితే మెరుపు హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్ మాత్రమే కాదు, కీపింగ్, ఫీల్డింగ్ అద్భుతంగా చేయగలడు కిషన్. పైగా జట్టును ముందుండి నడిపించడంలో అతడు నేర్పరి. అందువల్లే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును విజేతను చేశాడు. జార్ఖండ్ జట్టు గతంలో ఎన్నడు కూడా సయ్యద్ ముస్తాక్ అలి ట్రోఫీని గెలవలేదు. కానీ ఈసారి కిషన్ ఆ అపప్రదను తొలగించాడు. ఆటగాడిగా అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు నాయకుడిగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అందువల్లే ఝార్ఖండ్ జట్టు విజేతగా నిలిచింది.

డొమెస్టిక్ క్రికెట్లో సారధిగా సత్తా చూపించిన నేపథ్యంలో.. హైదరాబాద్ జట్టు బాధ్యతలను కూడా అతడికి అప్పగిస్తే బాగుంటుందని ప్రచారం జరుగుతోంది. అభిషేక్ శర్మకు ఇంతవరకు సారధిగా చేసిన అనుభవం లేదు. పైగా అతడు ఒత్తిడిని తట్టుకోలేడు. కీలక దశలో చేతులెత్తేస్తూ ఉంటాడు. అందువల్లే కిషన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. కొందరైతే ఆ కావ్యకు ఎవరైనా చెప్పండయ్యా.. కిషన్ కు సారధిగా నియమిస్తే బాగుంటుందని వివరించండయ్యా అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular