Iran NPT: ఇజ్రాయెల్ తో యుద్ధం వేళ ఇరాన్ ఫారిన్ మినిస్ట్రీ కీలక విషయం వెల్లడించింది. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫెరేషన్ ట్రీటీ నుంచి బయటకు రావాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇందుకోసం పార్లమెంట్ బిల్లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. కానీ విధ్వంసకర ఆయుధాల తయారీని వ్యతిరేకిస్తూనే ఉంటామనడం విశేషం. న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసే ఉద్దేశం తమకు లేదని ఆ దేశ ప్రెసిడెంట్ పెజెష్కియూన్ చెప్పిన విషయం తెలిసిందే.