
ఆఫ్ఘనిస్థాన్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి క్రికెటర్లు ఐపీఎల్ ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే తమ టీమ్ కు ఆడాల్సిన రషీద్ ఖాన్, మమ్మద్ నబీ మాత్రం యూఏఈలో జరిగే ఐపీఎల్ కు అందుబాటులో ఉంటారని సన్ రైజర్స్ హైదరాబాద్ సోమవారం ప్రకటించింది. టీమ్ సీఈవో షణ్ముగం మాట్లాడుతూ ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదానిపై మేము మాట్లాడలేదు. కానీ వాళ్లు మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు అని ఆయన స్పష్టం చేశారు.