
తెలుగు సినీ చరిత్రలో అత్యుత్తమ విలన్ లలో రావు గోపాల్ రావు పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన చూపిన విలనిజంకు 80వ దశకంలో మంచి పేరు వచ్చింది. ఆయన పోయాక రావుగోపాల్ రావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు ఆయన కుమారుడు రావు రమేశ్. ప్రస్తుతం టాలీవుడ్ లో రావు రమేశ్ బిజీ ఆర్టిస్ట్ గా మారారు. అంతేకాదు.. పలు ఇతర భాషల్లోనూ రావు రమేశ్ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ఇక రావు రమేశ్ ప్రధాన పాత్రధారుడిగా సినిమాలు వస్తున్నాయి. ఆయనపైనే కథలు రాస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ప్రధాన పాత్రధారుడిగా రావు రమేశ్ కు కోట్ల రూపాయల పారితోషికం అందుతోంది.
కొన్ని పాత్రలకు కొందరే సూట్ అవుతారు. అలా రావు రమేశ్ కోసం సృష్టించిన పాత్రల్లో ఆయనకు ఎంత పారితోషికం అయినా ఇచ్చి చేయించుకుంటున్నట్టు పరిస్థితి నెలకొంది.
తాజాగా రావు రమేశ్ కు బంపర్ లాటరీ తగిలిందని సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నాయట్టు’ను తెలుగులో రిమేక్ చేస్తున్నారు. మూడు పాత్రల చుట్టు తిరిగే కథ ఇదీ.. ఈ సినిమా కోసం హీరో విష్ణు, హీరోయిన్ అంజలితోపాటు రావు రమేశ్ ను ఎంచుకున్నారు. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కరుణ కుమార్ దర్శకుడు.
తెలుగులోనే నంబర్ 1 నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఈ రీమేక్ చేపట్టగానే ముందుగానే రావు రమేశ్ డేట్స్ బుక్ చేసుకున్నారట.. కథ విన్న వెంటనే రావు రమేశ్ ఓఖే చెప్పారట.. ఈ సినిమా కోసం ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి రావడంతో ఆయనకు ఏకంగా 1.5 కోట్ల పారితోషికాన్ని గీతా ఆర్ట్స్ ఫీక్స్ చేసిందట..
ఈ మధ్యకాలంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇంత పారితోషికం ఇవ్వడం ఇదే ప్రథమం అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇది రావు రమేశ్ నటనకు తగ్గ గుర్తింపు అని అంటున్నారు.