
కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -14వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి పునప్రాంభం కానుంది. తొలిరోజైన సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. నూతన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 10న క్వాలిఫయర్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్ మ్యాచ్ లు జరుగనున్నాయి. అక్టోబర్ 13న క్వాలిఫయర్ 2 మ్యాచ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.