
కరోనా సమయంలో లక్షలాది మందికి సాయం చేసిన సోనూసూద్ కు అంతర్జాతీయ బహుమతి లభించింది. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషనల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP) స్పెషల్ హ్యూమానిటరియన్ యాక్షన్ అవార్డును సోనుసూద్ కు ప్రధానం చేసింది. కరోనా లాక్ డౌన్ సమయంలో చిక్కుకున్న లక్షలాది మంది వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్పించడం, విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం ఉపాధి లేనివారికి ఉపాధి కల్పించడం లాంటివి ఇంకా ఎన్నో చేసాడు. కాగా దీనిపై సూనుసూద్ నా తోటి భారతీయులకు నేను చెయ్యగలిగిన సాయంలో చిన్న సాయం అని తెలిపాడు.