
ఏపీలో రోజు రోజుకి నమోదవుతున్న కరోనా కేసులు తగ్గుతున్నాయి అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కలెక్టర్ లతో స్పందన కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్ కరోనా పాజిటివ్ రేటు 12నుండి 8.3% శాతానికి తగ్గిందని తెలిపారు. కరోనా ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీ కింద అందిస్తున్న ఏకైక రాష్టం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని ఆయన తెలిపారు. కోవిడ్ సెంటర్ లలో కచ్చితంగా ఫుడ్ సప్లై అవ్వాలని, ప్రతి రోజు శానిటైజేర్ తో శుభ్రం చెయ్యాలని మాట్లాడారు. కరోనా హోమ్ ఐసొలేషన్ లో వున్నా వారికి కరోనా కిట్లు అందించే బాధ్యత కలెక్టర్ లదే అని ఆయన పేర్కొన్నారు.