Homeవార్త విశ్లేషణShekhar Kammula: గొప్ప ప్రేమకావ్యాలే ‘లవ్ స్టోరీ’ కి ఇన్సిపిరేషన్.. శేఖర్ కమ్ముల

Shekhar Kammula: గొప్ప ప్రేమకావ్యాలే ‘లవ్ స్టోరీ’ కి ఇన్సిపిరేషన్.. శేఖర్ కమ్ముల

Sekhar Kammula

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “లవ్ స్టోరీ”. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఈ చిత్రంలో నాగ చైతన్య మరియు సాయి పల్లవి లు నటించారు. సెప్టెంబర్ 24 న రిలీజ్ కాబున్న ఈ మూవీ గురించి దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు.. లవ్ స్టోరీ ఫీల్ గుడ్ మూవీ. ఒక అమ్మాయి, అబ్బాయికి మధ్య ఉండే రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కూడా ఉంటాయి వాటితో పాటుగా మరో కీలక పాయింట్ ఈ సినిమాని మరో స్థాయిలో పెట్టేలా ఉంటుంది అదే ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్ లా ఉంటుంది అందుకు ఇది మంచి లవ్ స్టోరీలా ఉంటుంది. ఈ సినిమాలో రెండు పాయింట్స్ తీసుకున్నాం ఒకటి కుల వివక్షత అనేది అబ్బాయి విషయంలో ఇంకొకటి ఆడ మగ తారతమ్యంపై.. ఈ రెండు విషయాల పై సినిమాలో బలంగా చూపించడం జరిగింది.

లీడర్ లో అవినీతిపై చేద్దాం అనుకున్నాను అందులో కులం కోసం పెట్టిన సీన్ చిన్న పార్ట్ వరకు మాత్రమే కానీ దానిపైనే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చేద్దామని ఎప్పుడు నుంచో ఉంది. సమాజంలో ఎప్పుడూ ఏదొక సమస్య ఉంటూనే ఉంటుంది అలా చూసి చూసి ఫైనల్ గా రెండు బలమైన పాయింట్స్ తో లవ్ స్టోరీ లో చూపించడం జరిగింది. లాక్ డౌన్ వచ్చే టైం ఇంకా జస్ట్ కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంది కంప్లీట్ చెయ్యడానికి టైం కోసం చూస్తున్నాం ఆ గ్యాప్ లో ఎడిటింగ్ కంప్లీట్ చెయ్యాలి అనుకున్నాం, అది కూడా పూర్తిగా ఆ టైం లో చేయలేకపోయాం. తర్వాత మళ్ళీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇండస్ట్రీలో ఫస్ట్ షూట్ కూడా మేమే స్టార్ట్ చేసాం అలా కొన్నాళ్ళు చేసి రిలీజ్ చేద్దామన్న టైం లో రెండో వేవ్ వచ్చేసింది. నిజానికి ఆ టైం లో అయితే వేరే నిర్మాతలు ఖచ్చితంగా సినిమా ఓటిటికి ఇచ్చేసేవాళ్ళు. కానీ మా నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఉన్నారు. వారికి కూడా థియేటర్స్ ఉన్నాయని కాదు, వారికి తెలుసు సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాల్సింది అని అందుకే ఇన్నాళ్లు ఆగారు. నిజంగా వారు దొరకడం నాకు ఇంకా బలం వచ్చినట్టు అయ్యింది.

ఈ గ్యాప్ లోనే చాలా అనుమానాలు, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మేము చెయ్యాలా వద్దా అని సందేహాలు నేను తీసుకున్న పాయింట్స్ కూడా మామూలువి కాదు అందరినీ మెప్పించాలి అనేది ఒకటి ఇలా ఎన్నో అనిపించాయి ఇక ఫైనల్ ఈ సెప్టెంబర్ 24 కి ఈ సినిమాని తీసుకురావాలని ఫిక్స్ అయ్యాం. నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ మెమరబుల్ ఎక్స్ పీరియన్స్.చిరంజీవి,ఆమీర్ ఖాన్ లు ఈవెంట్ కు అటెండ్ అయి ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్లకు స్పెషల్ థాంక్స్. నాగచైతన్య ను తెలంగాణ కుర్రాడిగా చూపించడానికి ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం, సినిమాలో తన డైలాగ్స్ నుంచి మ్యానరిజమ్స్ వరకు ప్రతీ అంశంలో కూడా డబ్బింగ్ లో ప్రతి పదం సినిమా షూట్ లో కూడా నా టీం అంతటితో చాలా వర్క్ చేసిన తెలంగాణా స్లాంగ్ లో చైతూని ముందు సినిమాల్లో చూపించని విధంగా ట్రై చేసాం. ఖచ్చితంగా చాలా నమ్మకంగా చెప్తున్నాం ఈ సినిమాలో చాలా కొత్త నాగ చైతన్యని అందరూ చూస్తారు. అంతే కాదు అతని తల్లిగా ఈశ్వరి రావు చాలా బాగా చేసింది.తనకు ఫోన్ లో క్యారెక్టర్ గురించి చెప్పి నెక్స్ట్ డే ఆడిషన్స్ కోసం పిలిస్తే.. 80 రూపాయల చీర కట్టుకొని అదే క్యారెక్టర్ లో వచ్చింది. అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్.అలా అందరూ ఈ సినిమా కోసం కష్టపడ్డారు.

సాయి పల్లవి ని మళ్లీ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆమె ఒక మంచి పెర్ఫామార్ అంతే అంతకు మించి ఏం లేదు.. చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఫిదా నుంచి ట్రావెల్ అయ్యాం కాబట్టి తన కోసం బాగా తెలుసు అందుకే ఈ సినిమాకి తీసుకున్నాం. ముందు ఫిదా లో అయితే తన రోల్ ఒకలా ఉంటుంది కానీ ఈ సినిమాలో కంప్లీట్ దానికి వ్యతిరేఖంగా కనిపిస్తుంది. తనలోనే తాను మధనపడుతూ స్ట్రగుల్ అవుతూ ఉండేలా కనిపిస్తుంది. చాలా షేడ్స్, లెటర్స్ ఉన్న రోల్ అది దానిని తను చాలా కస్టపడి చేసింద తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version