Mokshagna debut : బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన రిలీజ్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. మొత్తానికైతే ఒక వారం రోజులు లేటుగా ఈ సినిమా థియేటర్లోకి వస్తుండడం విశేషం. ఇక బాలయ్య బాబు ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటే వరుసగా ఐదు విజయాలను సాధించిన సీనియర్ హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు… నందమూరి అభిమానులను బాలయ్య ప్రతి సంవత్సరం తన సినిమాలతో అలరిస్తున్నప్పటికి బాలయ్య వారసుడు అయిన మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా వస్తుంది అంటూ అనౌన్స్ చేసినప్పటికి ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు… ఇక ఇప్పుడు బాలయ్య చాలా పకడ్బందీ ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2026 జనవరి 1 వ తేదీన మోక్షజ్ఞ సినిమా ని స్టార్ చేయబోతున్నారట.
ఇక అదే సంవత్సరం చివరిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక మంచి లవ్ స్టోరీ తో మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడట.
ఇక అందులో ఎలివేషన్స్, ఎమోషన్స్ సైతం భారీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు కి వరుస సక్సెస్ లను అందించిన బోయపాటి శ్రీను మోక్షజ్ఞను ఇండస్ట్రీకి ఎలా పరిచయం చేయబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కథ మొత్తం పూర్తి చేసిన బోయపాటి తొందరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
జనవరి ఒకటోవ తేదీన మాత్రం ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ విషయాన్ని తొందరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదైనా వర్కౌట్ అవుతుందా? లేదంటే మళ్లీ బిస్కెట్ అవుతుందా? అనే ధోరణి లోనే చాలామంది ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…