
ఏపీకి చెందిన హాకీ క్రీడాకారిణి రజని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా రజనీని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఒలింపిక్స్ లో ప్రతిభ చూపిన ఆమెకు పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25 లక్షల నగదు ప్రోత్సాహం, ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తిరుపతిలో వెయ్యి గజాల స్థలం, నెలకు రూ. 40 వేల ఇన్సెంటివ్ ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.