Canada: కెనడా లో ఓ భారతీయ విద్యార్థిని మృతి చెందింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. భారత కాన్సులేట్ జనరల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దిల్లీకి చెందిన తాన్యా కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంది. ఆమె గురువారం మరణించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియలేదు. ఈ విషయాన్ని వాంకోవర్ లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. బాధిత కుటుంబానికి కాన్సులెట్ సంతాపం తెలిపింది.