India Women vs England Women : ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో టీమిండియా దారుణమైన ఓటమిపాలైంది. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక ఇంగ్లాండ్ ముందు తలవంచింది.. ఇంగ్లాండ్ ముందు పోయిన మన పరువును అమ్మాయిలు నిలబెట్టారు. కసి కొద్దిగా ఆడి… అదరగొట్టారు. క్రికెట్ మక్కాగా పేరుపొందిన లార్డ్స్ లో సరికొత్త చరిత్ర నెలకొల్పారు. భారత జట్టుకు చారిత్రాత్మకమైన విజయాన్ని అందించారు.
ఈ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టును భారత మహిళలు మట్టి కరిపించారు. ఏకంగా 270 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లార్డ్స్ లో టెస్ట్ మ్యాచ్ గెలిచింది హర్మన్ సేన..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అతిథ్య జట్టు ఫస్ట్ బౌలింగ్ చేసింది. బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు 285 పరుగులు తొలి ఇన్నింగ్స్ లో చేసింది. శఫలివర్మ డక్ అవుట్ అయినప్పటికీ.. మృతి మందాన 83 పరుగులు చేసింది. కెప్టెన్ కౌర్ 58 పరుగులు చేసింది. దీప్తి శర్మ 57 పరుగులు చేసింది. జమీమా 35 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ జట్టులో జోన్స్ మాత్రమే ఆకట్టుకుంది. 52 పరుగులు చేసి సత్తా చాటింది.
ఇండియన్ బౌలర్లలో క్రాంతి గౌడ్ ఐదు వికెట్లు పడగొట్టింది. లార్డ్స్ మైదానంలో ఐదు వికెట్లు సొంతం చేసుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ గా ఆమె చరిత్ర సృష్టించింది.. తొలి ఇన్నింగ్స్ లో 115 పరుగుల లీడ్ కలుసుకుని.. రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా.. నష్టానికి 341 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ యాస్తిక 113 పరుగులు చేసి అదరగొట్టింది.
టీమిండియా విధించిన 457 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో ఇంగ్లాండ్ తడబడింది. రెండవ వైనింగ్స్ లో ఆదివారం నాటికే ఆరు వికెట్ల నష్టానికి వంతటి పరుగులు చేసింది. ఇక సోమవారం ఓవర్ నైట్ స్కోర్ 130/6 తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు.. మరో 56 పరుగులు మాత్రమే నమోదు చేసి కుప్పకూలిపోయింది. ఇక ఇంగ్లాండ్ స్టార్ సోఫి టెస్టులలో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. పదో వికెట్ గా ఆమె వెను తిరిగింది. దీంతో ఇంగ్లాండ్ కథ సమాప్తమైంది. ఏకంగా 270 పరుగులు తేడాతో ఇంగ్లాండ్ మీద ఇండియా విజయం సాధించింది.
