India Vs Eng Test 2025: ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్ ప్లేయర్లను గాయాలు వెంటాపడుతున్నాయి. ఇప్పటికే పేసర్లు మార్క్ వుడ్, ఒలీ స్టోన్ గాయాలతో సతమతమవుతుండగా.. మరో బౌలర్ అట్కిన్సన్ కూడా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో ఆయన తొలి టెస్టులో ఆడడం కష్టమే. అట్కిన్సన్ కోలుకోవడానికి 3 వారాల సమయం పట్టే అవకాశం ఉందని ఆ దేశ క్రీడ వర్గాలు చెబుతున్నాయి.