Homeజాతీయ వార్తలుPM-KISAN : రైతన్నకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడత డేట్ వచ్చేసింది.. ఈ పని...

PM-KISAN : రైతన్నకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడత డేట్ వచ్చేసింది.. ఈ పని త్వరగా చేసేయండి

PM-KISAN : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద 20వ విడత నిధులు జూన్ 2025లో విడుదల కానున్నాయి. రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, గ్రామీణ ఆదాయాన్ని స్థిరీకరించడం, రైతులు తమ వ్యవసాయ ఖర్చులను తీర్చుకోవడానికి సహాయపడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పీఎం-కిసాన్ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం అర్హతగల రైతులకు సంవత్సరానికి రూ. 6,000ను అందిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తుంది.

ఎన్ని విడతలు వచ్చాయి?
2019లో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం-కిసాన్ ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ డెబిట్ ట్రాన్సఫర్ పథకంగా మారింది. ఈ పథకం ఇప్పటికే 19 వాయిదాలను పూర్తి చేసింది. ఇటీవల 19వ విడత నిధులను ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ విడుదల చేశారు. దీని ద్వారా 2.4 కోట్ల మంది మహిళా లబ్ధిదారులతో సహా మొత్తం 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. అంతకుముందు 18వ విడత అక్టోబర్ 2024లో 17వ విడత జూన్ 2024లో విడుదల అయ్యాయి.

20వ విడత ఎప్పుడు?
20వ విడత నిధులు జూన్ 2025లో విడుదల కానున్నాయి. ఖచ్చితమైన విడుదల తేదీ, ప్రదేశం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రధాని మోదీ మరోసారి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని విస్తృతంగా భావిస్తున్నారు. ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మహిళా రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. గత విడతలో 2.4 కోట్ల మంది మహిళా లబ్ధిదారులు ప్రయోజనం పొందగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

పీఎం-కిసాన్ యోజనకు ఎవరు అర్హులు?
1. భారత పౌరుడై ఉండాలి.
2. వ్యవసాయం చేయగల సాగు భూమిని కలిగి ఉండాలి.
3. చిన్న లేదా సన్నకారు రైతులు అయి ఉండాలి.
4. నెలకు రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతూ ఉండకూడదు.
5. మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను కట్టి ఉండరాదు.
ఈ నిబంధనలకు వెలుపల ఉన్న రైతులను పథకం నుంచి మినహాయించారు, తద్వారా లబ్ధి సరైన వారికి చేరుతుంది.

ఈ-కేవైసీ ఎందుకు ముఖ్యం? ఎలా చేయాలి?
పీఎం-కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పథకంలో నమోదు చేసుకున్న రైతులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి.
* ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ: అధికారిక పీఎం-కిసాన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు.
* బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ: సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో చేసుకోవచ్చు.

పీఎం-కిసాన్ లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
1. https://pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2. Know Your Status అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
3.మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను ఎంటర్ చేసి Get Data మీద క్లిక్ చేయాలి.
4. మీ ప్రజెంట్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి.

పీఎం-కిసాన్ లబ్ధిదారుల లిస్ట్ ఎలా చెక్ చేయాలి ?
1. https://pmkisan.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
2. Beneficiary List)పై క్లిక్ చేయాలి.
3. మీ రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి.
4. కంప్లీట్ లిస్టును చూడటానికి Get Report పై క్లిక్ చేయండి.

పీఎం-కిసాన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
1. https://pmkisan.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
2. New Farmer Registration పై క్లిక్ చేయాలి.
3. మీ ఆధార్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి.
4. వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి Yes మీద క్లిక్ చేయాలి.
5. రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
6. తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular