
భారతదేశం యొక్క సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకుంటున్న పాకిస్థాన్ కు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. 28సంవత్సరాలుగా సిబిఐ కోర్టులో వున్న బాబ్రీ మసీద్ వివాదంపై సిబిఐ ప్రత్యక న్యాయస్థానం నిన్న తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు పై పాకిస్థాన్ స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. భారతదేశంలోని మైనారిటీలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు రక్షణ కల్పించాలని, భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ తీర్పు పై భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, భారత దేశం పరిపక్వతగల ప్రజాస్వామిక దేశమని, కోర్టు తీర్పుల పట్ల ప్రజలు విధేయత వ్యక్తం చేస్తారని తెలిపారు. అధికార వ్యవస్థ తన ఇష్టానుసారం ప్రజలను, కోర్టులను నోరు మెదపకుండా చేసే నిర్బంధ వ్యవస్థకు ఈ ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకోవడం కష్టమని పేర్కొన్నారు.