బీజేపీ వర్సెస్ కాంగ్రెస్: ఉద్రిక్తత.. పరుగులు పెట్టిన రేవంత్

హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం.. ఆయనను తోసేశారని.. అరెస్ట్ చేశారని తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. ఏకంగా హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా రేవంత్ రెడ్డి రోడ్డెక్కి ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాహుల్ […]

Written By: NARESH, Updated On : October 1, 2020 8:41 pm
Follow us on

హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్ల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం.. ఆయనను తోసేశారని.. అరెస్ట్ చేశారని తెలియడంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. ఏకంగా హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా రేవంత్ రెడ్డి రోడ్డెక్కి ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకొని కిందపడేసిన సందర్బంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ , బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా రావడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్ పై బీజేపీ నాయకులు దాడి చేశారు. ఈ వార్త తెలియగానే గాంధీ భవన్ లో ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో నాంపల్లి రోడ్డుపై రేవంత్ రెడ్డి పరుగులు పెట్టారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

రేవంత్ రెడ్డికి పోటీగా బీజేపీ కార్యకర్తలు కూడా ధర్నా చేశారు. ఇలా రాహుల్ గాంధీ అరెస్ట్ తో హైదరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్య పెద్ద ఫైట్ జరిగింది. రోడ్డుపైకి ఇరు పార్టీల నేతలు చేరడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.