
టీమ్ ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. భోజన విరామానికి ముందు చివరి బంతికి కేఎల్ రాహుల్ (8) ఔటయ్యాడు. 54 బంతులు ఆడిన అతడు ఎంత ఓపిగ్గా చేసినా చివరికి క్రేగ్ ఓవర్టన్ బౌలింగ్ లో స్లిప్ లో బెయిర్ స్టోకు చిక్కాడు. దాంతో భారత్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మరోవైపు రోహిత్ (25) పరుగులతో కొనసాగుతున్నాడు. అంతకుముందు ఇంగ్లాండ్ 423/8 ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆట ప్రారంభించి 432 పరుగులకు ఆలౌలైంది. దాందో భారత్ పై 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది.