
భర్త కరోనాతో మృతి చెందడంతో కలత చెందిన భార్య (గర్భణి) ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. కనకపుర పట్టణ పరిధిలోని బసవేశ్వరనగర్ లో నివసిస్తున్న బెస్కాం ఉద్యోగి నందిని (28) ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిని రెండేళ్ల క్రితం మైసూరుకు చెందిన సతీష్ అనే వ్యాపారవేత్తను ప్రేమ వివాహం చేసుకుంది. సతీష్ వ్యాపార నిమిత్తం మైసూరు, కనకపుర తిరిగేవారు. మైసూరులో ఉన్న సతీష్ తల్లి గతవారం కరోనాతో మృతి చెందింది. సతీష్ కూ కరోనా సోకడంతో మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నందిని మూడు నెలల గర్భిణి. దీంతో కలత చెందిన నందిని గురువారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కనకపుర పట్టణ పోలీసులు కేసు నమోదు చేసున్నారు.