INDIA Alliance దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఇండియా (INDIA) కూటమి భవిష్యత్తుపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూటమిలో పేరుకే 25కు పైగా పార్టీలు ఉన్నప్పటికీ, వాస్తవంగా చురుకుగా పనిచేస్తున్నవి దాదాపు 14 పార్టీలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిగతా పార్టీలు కేవలం పేరు కోసం మాత్రమే కూటమిలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
అంతేకాదు, కూటమిలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలకు తమ తమ రాష్ట్రాల్లోనే ఆశించిన స్థాయిలో బలం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని పార్టీలు వరుస ఎన్నికల్లో పరాజయాలు ఎదుర్కొంటుండగా, మరికొన్ని పార్టీలు అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే శక్తి ఇండియా కూటమికి ఉందా అనే సందేహం వ్యక్తమవుతోంది.
కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విధానపరమైన విభేదాలు, నాయకత్వంపై స్పష్టత లేకపోవడం, రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాల్లో తలెత్తే వివాదాలు కూడా కూటమి బలహీనతలుగా కనిపిస్తున్నాయి. ఒకే లక్ష్యం కోసం కలిసిన పార్టీలు ఎన్నికల తర్వాత కూడా ఐక్యంగా కొనసాగగలవా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
అందుకే రాజకీయ ప్రత్యర్థులు ఇండియా కూటమిని “అతుకుల బొంత”గా అభివర్ణిస్తున్నారు. కూటమి మనుగడ, ప్రభావం పూర్తిగా పార్టీల ఐక్యత, ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం, బలమైన నాయకత్వాన్ని ప్రదర్శించడంపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇండీ కూటమిలో పేరుకే 25 పార్టీలు నిజానికి 14 మాత్రమే దీనిపై ’రామ్‘ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

