
దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కొత్తగా 36,946 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 422 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,95,958కు పెరిగింది. ఇందులో 3,08,57,467 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,13,718 యాక్టివ్ కేసులు ఉన్నాయి.