
దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 593 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది.