
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. గతేడాది కరోనా వైరస్ విజృంభణ వల్ల పరిస్థితులు మారిపోయాయి. ఆదాయం లేకపోవడం, ఉపాధి కోల్పోవడం వల్ల చాలామంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అర్హత ఉన్నవాళ్లకు సులభంగా రుణం మంజూరు చేస్తుండటం గమనార్హం.
కేంద్ర సర్కార్ స్వనిధి యోజన స్కీమ్ ద్వారా సులభంగా 10,000 రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆత్మ నిర్భర్ నిధి స్కీమ్ లో భాగంగా 2020 జూన్ 1వ తేదీన కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ కు అర్హత పొందడానికి ఇప్పటివరకు 43.1 లక్షల రుణ దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటికే 25.2 లక్షల రుణాలు మంజూరు కావడం గమనార్హం.
కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ ఈ రుణాలను 22.7 లక్షల మందికి పంపిణీ చేశామని వెల్లడించారు. మహారాష్ట్ర రాష్ట్రంలో జూలై 26, 2021 నాటికి 4.2 లక్షల రుణ దరఖాస్తులు రాగా ఈ దరఖాస్తులలో 1.6 లక్షల మందికి కేంద్రం రుణాలను పంపిణీ చేసింది. చిరు వ్యాపారులను ఉద్దేశించి కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. చిరు వ్యాపారులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్రం రుణాలను మంజూరు చేస్తోంది.
రోడ్ సైడ్ బండి లేదా వీధి-రహదారిపై దుకాణాలను నడిపే వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. లాండ్రీ, సెలూన్, పాన్ షాపులు, పండ్లు, కూరగాయల దుకాణాలు కూడా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. వీధి విక్రేత ఈ మొత్తాన్ని సంవత్సరంలోపు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. హామీ లేకుండానే ఈ రుణాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ కింద జరిమానా విధించే అవకాశం లేకపోవడంతో పాటు రుణం సకాలంలో ఎవరు చెల్లించినా వాళ్లకు వడ్డీలో రాయితీ లభిస్తుంది.