ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు ఏ విధంగా జరుగుతోంది అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. చాలా మంది అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంతో పథకాలు ప్రజలకు సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. దీంతో జగన్ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. పనిచేయని వారికి మెమోలు అందజేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో అధికారులకు సైతం ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఇన్నాళ్లు జగన్ కు పటిష్టమైన అధికార యంత్రాంగం ఉందని అనుకున్నాది అంతా వట్టిదే అని తేలిపోయింది. అధికారులపైనే భారం వేయడంతో పథకాల అమలు సఫలం కాలేకపోతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలు అప్పగించకుండా బ్యూరోకాట్స్ ను నమ్ముకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతోనే పథకాల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతోనే ప్రజలు ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికైనా జగన్ తన పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు. రాజకీయాలు వేరు అధికారులు వేరు కావడంతోనే పథకాల అమలులో దూరం పెరిగినట్లు సమాచారం. సమీక్షలు చేస్తే సరిపోదు వాటిని క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలు జరుగుతున్నది కూడా పరిశీలించాలి. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయి. ఇన్నాళ్లు అలా పట్టించుకోకపోవడంతోనే పథకాలపై అధికారులకు పట్టింపు లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.