దేశంలో ఉత్తమ యూనివర్సిటీ జాబితాల్లో ఐఐటీ మద్రాస్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్ వర్క్ సంవత్సరానికి గానూ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఐఐటీ మద్రాస్ టాప్ స్థానంలో నిలిచింది. అన్ని విభాగాలతో పాటు ఇంజినీరింగ్ కేటగిరీలోనూ తొలిస్థానం సాధించింది. ఐఐటీ మద్రాస్ ఈ ఘనత ను సాధించడం వరుసగా ఇది మూడోసారి.