ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో రామాపురం క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఈపాస్ లేని వాహనాలు తెలంగాణ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. తెలంగాణలో పగటిపూట లాక్ డౌన్ ఎత్తేశారని ప్రయాణికులు రామాపురం చెక్ పోస్ట్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో చెక్ పోస్ట్ వద్ద వాహనాల తాకిడి పెరిగింది. ఆంధ్ర నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈపాస్ ఉంటేనే కోదాడ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈపాస్ లేని వాహనాలకు వెనక్కి పంపిస్తున్నారు. దీంతో వందలసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.