https://oktelugu.com/

కొత్త కారు కొనేవాళ్లకు శుభవార్త.. రూ.లక్షన్నర తగ్గింపు..?

ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హ్యుందాయ్ కొత్త కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. జూన్ నెల చివరి వరకు హ్యుందాయ్ ఎంపిక చేసిన కారు మోడళ్లపై ఏకంగా లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తుంటం గమనార్హం. హ్యుందాయ్ కారు మోడల్ ను బట్టి డిస్కౌంట్ లో మార్పులు ఉంటాయని సమాచారం. హ్యుందాయ్ శాంట్రో కారుపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 13, 2021 / 04:01 PM IST
    Follow us on

    ప్రముఖ కార్ల కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. హ్యుందాయ్ కొత్త కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. జూన్ నెల చివరి వరకు హ్యుందాయ్ ఎంపిక చేసిన కారు మోడళ్లపై ఏకంగా లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్ అందిస్తుంటం గమనార్హం. హ్యుందాయ్ కారు మోడల్ ను బట్టి డిస్కౌంట్ లో మార్పులు ఉంటాయని సమాచారం.

    హ్యుందాయ్ శాంట్రో కారుపై రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాడ్ ఐ10 నియోస్ కారుపై 35వేల రూపాయల వరకు తగ్గింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. హ్యుందాయ్ ఆరా కారుపై 35వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. హ్యుందాయ్ ఐ10 కారుపై ఎటువంటి డిస్కౌంట్ లేకపోయినా 5 సంవత్సరాల వారంటీ లభిస్తుంది.

    హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్ ను పొందే అవకాశం ఉండగా సమీపంలోని హ్యూందాయ్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు హ్యూందాయ్ ఆఫర్ల వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. తక్కువ ధరకే కారును కొనుగోలు చేయవచ్చు.

    పరిమిత కాలం ఆఫర్ కావడంతో కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు కొత్త కారును త్వరగా కొనుగోలు చేస్తే మంచిది. హ్యూందాయ్ కంపెనీ ప్రతి సంవత్సరం కొత్త కార్లను మార్కెట్ లోకి తెస్తున్న సంగతి తెలిసిందే.