https://oktelugu.com/

Hair loss : రాత్రి ఈ తప్పులు చేస్తున్నారా? కచ్చితంగా మీ జుట్టు రాలుతుంది.

ఎంత కేర్ తీసుకున్నా జుట్టు రాలే సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. దీనికోసం మనం నిద్రపోయేటప్పుడు కొన్ని మిస్టేక్స్‌ని చేయకుండా జాగ్రత్త పడాలి. దీని వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకీ మీరు చేసే తప్పులు ఏంటో చూసేద్దామా?

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 21, 2024 / 12:16 AM IST

    Hair loss

    Follow us on

    Hair loss : జుట్టు అంటే చాలా మందికి ఇష్టం. కానీ రెగ్యూలర్ గా చాలా తప్పులు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి చాలా తప్పులు చేస్తారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోరు. సో సమస్య మరింత పెరుడుతుంది. కొన్ని విషయాలు తెలియక ఎలా పడితే అలా నిద్రపోతుంటారు. ఈ తప్పులు చేస్తూ జుట్టు విషయంలో ఎన్ని టిప్స్ ఫాలో అయినా, ఎంత కేర్ తీసుకున్నా జుట్టు రాలే సమస్య మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. దీనికోసం మనం నిద్రపోయేటప్పుడు కొన్ని మిస్టేక్స్‌ని చేయకుండా జాగ్రత్త పడాలి. దీని వల్ల జుట్టు సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతకీ మీరు చేసే తప్పులు ఏంటో చూసేద్దామా?

    కొందరు ఏకంగా జుట్టుని విరబోసుకుని మరీ నిద్రపోతారు. దీని వల్ల చిక్కులు పడుతాయి. జుట్టు చిక్కులు అయితే వీటిని తీయడం కష్టం. తీస్తున్నప్పుడు జుట్టు రాలుతుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే వదులుగా అల్లడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు చిక్కు పడదు రాలదు.

    జుట్టుని ముడి వేయడానికి క్లిప్స్ వాడితే మరికొందరు టైట్ హెయిర్ బ్యాండ్ వాడుతుంటారు. వీట వల్ల జుట్టుని లాగినట్లుగా అవుతుంది. ఈ సమయంలో జుట్టు బలహీనం అవుతుంది. తద్వారా రాలిపోతుంది. అలా కాకుండా హెయిర్‌బ్యాండ్ కాస్తా లూజ్‌గా ఉండేలా చూసుకుంటే ఈ సమస్య ఉండదు. దీని వల్ల జుట్టు రాలదు. ఏ హెయిర్‌బ్యాండ్ అయినా కాస్తా లూజ్‌గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక క్లిప్స్ వాడే ముందు కూడా జాగ్రత్త. వాటి పండ్ల వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఇది మీరు గమనించే ఉంటారు.

    పిల్లో కవర్స్ కూడా జుట్టుపై నెగెటీవ్ ఎఫెక్టివ్‌ని చూపిస్తాయి అంటున్నారు నిపుణులు. సాధారణంగా, సిల్క్, శాటిన్ పిల్లో కవర్స్ కు దూరంగా ఉండండి.వీటి వల్ల జుట్టు టెక్చర్ మారే అవకాశం ఎక్కువ ఉంటుందట. అంతేకాదు జుట్టు బలహీనం అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? జుట్టుకి మేలు చేసే పిల్లో కవర్స్ వాడడం మంచిది. వీలైతే కాటన్ లాంటివి, సాఫ్ట్ పిల్లో కవర్స్ వాడటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

    సమయం లేదని, ఉదయం కుదరలేదని కొందరు రాత్రి తలస్నానం చేస్తుంటారు. సాయంత్రం, రాత్రి సమయంలో తలస్నానం చేయడం తప్పు కాదు. కానీ, తల పూర్తిగా ఆరకముందే నిద్రపోవడం వల్ల మాత్రం సమస్యలు పెరుగుతాయి. తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జుట్టు బలహీనం అవుతుంది. దీంతో ఎక్కువగా ఊడిపోతుంది. ఈ సమస్య నుంచి దూరంగా ఉండాలంటే రాత్రి తలస్నానం చేయవద్దు. లేదంటే జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత నిద్రపోవాలి.

    రాత్రుళ్ళు కొద్దిగా గోరువెచ్చని నూనె తీసుకుని తలకి రాసుకోండి. కుదిరితే కాసేపు మసాజ్ చేసుకోండి. చాలా హాయినిస్తుంది. దీని వల్ల జుట్టుకి పోషణ అంది మీ జుట్టు చిట్లకుండా ఉంటుంది. కాబట్టి, వీలైతే కచ్చితంగా రాత్రుళ్ళు జుట్టు కుదుళ్ళకి నూనె రాసుకోండి. తర్వాత కాస్త మసాజ్ కు కూడా సమయం ఇవ్వండి. ఈ చిన్న టిప్ వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..