
ఐపీఎల్ ను విజయవంతం చేసేందుకు బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంటోది. ఏ మాత్రం కరోనా వైరస్ కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఒక వేళ బంతి స్టాండ్స్ లేదా స్టేడియం అవతల పడితే నాలుగో అంఫైర్ మరో బంతిని ఇస్తారు. అంతకు ముందు బంతి దొరకగానే దానిని ఆల్కహాల్ ఆధారిత వైవ్స్ లేదా యూవీ-సీ తో శుభ్రపరుస్తారు. మళ్లీ బంతులను లైబ్రరీలో చేర్చుతారు. ఆటగాళ్లు మైదనంలో ఉమ్మి వేయడాన్నీ బీసీసీఐ నిషేధించనుందని తెలిసింది. ఇందుకోసం టిష్యూ పేపర్లను వారికి అందివ్వనుంది. వాటిని ఆటగాళ్లే జాగ్రత్తగా చెత్త కుండీలో వేయాలి. లీగ్ కోసం యూఏఈలో 14 న బయో బుడగలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.