విజయసాయిరెడ్డి పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీై కేసులు, లేదంటే ఈడీ రెండు కేసులు సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు సైతం విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరోవైపు ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ […]
Written By:
, Updated On : August 10, 2021 / 02:38 PM IST

జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీై కేసులు, లేదంటే ఈడీ రెండు కేసులు సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు సైతం విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరోవైపు ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్ దాఖలు చేసిన పిటిషన్లనూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.