ఎక్స్ క్లూజివ్ : లక్ష్మణ్ పొరపాటు ‘దిల్ రాజు’కి బలమైంది !

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికే సరైన గౌరవం తెచ్చిన వ్యక్తి గా ‘దిల్ రాజు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే, దిల్ రాజు వెనుక ఉన్న శక్తి. శిరీష్ – లక్ష్మణ్. ఈ ఇద్దరి కష్టం తోడు కావడంతోనే ‘దిల్ రాజు’ తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. అందుకే దాదాపు చాలా సినిమాలకు ఈ ముగ్గురు పేర్లు కలిసికట్టుగా కనిపించేవి. వినిపించేవి. ముఖ్యంగా శిరీష్ సినిమా నిర్వహణ బాధ్యతలు […]

Written By: admin, Updated On : August 10, 2021 3:04 pm
Follow us on

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికే సరైన గౌరవం తెచ్చిన వ్యక్తి గా ‘దిల్ రాజు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే, దిల్ రాజు వెనుక ఉన్న శక్తి. శిరీష్ – లక్ష్మణ్. ఈ ఇద్దరి కష్టం తోడు కావడంతోనే ‘దిల్ రాజు’ తిరుగులేని నిర్మాతగా ఎదిగారు. అందుకే దాదాపు చాలా సినిమాలకు ఈ ముగ్గురు పేర్లు కలిసికట్టుగా కనిపించేవి. వినిపించేవి.

ముఖ్యంగా శిరీష్ సినిమా నిర్వహణ బాధ్యతలు చూసుకుంటే.. లక్ష్మణ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు చూసుకునే వారు. అందుకే, దిల్ రాజు నిర్మాతగా ఎంత బిజీగా ఉన్నా.. ఆయన సినిమాలకు సంబంధించి పక్కా లెక్కలతో కలెక్షన్స్ ఇంటికి వచ్చేవి. అయితే, దిల్ రాజుతో విభేదించి లక్ష్మణ్ బయటికొచ్చాక.. లెక్కలు మారిపోయాయి. దిల్ రాజు సినిమాలు ప్లాప్ అవ్వడం మొదలుపెట్టాయి.

మరోపక్క లక్ష్మణ్ సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేసి.. దిల్ రాజుకే పోటీగా మారాడు. అగ్నికి ఆజ్యం పోసినట్టు.. లక్ష్మణ్ విడుదల చేసిన మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ అద్భుతమైన కలెక్షన్స్ తో సూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో నిర్మాతలకు లక్ష్మణ్ పై నమ్మకం పెరిగింది. అంచనాలు ఉన్న చాలా సినిమాలు లక్ష్మణ్ దగ్గరకు వెళ్లాయి.

దిల్ రాజ్ అంటే పడని వాళ్లు, అలాగే కొంతమంది నిర్మాతలు ‘లక్ష్మణ్’ను డిస్ట్రిబ్యూటర్ గా బాగా ప్రమోట్ చేస్తూ బాగానే హడావిడి చేశారు. ఇక డిస్ట్రిబ్యూషన్ లో దిల్ రాజు కంటే.. లక్ష్మణే తోపు అని స్థాయికి ఎదిగాడు లక్ష్మణ్. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. లక్ష్మణ్ చేసిన పొరపాటు కారణంగా.. నిర్మాతలు మళ్ళీ దిల్ రాజు వైపు చూస్తున్నారు.

ఇంతకీ లక్ష్మణ్ చేసిన పొరపాటు ఏమిటంటే.. నాని ‘టక్ జగదీష్’ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను లక్ష్మణ్ కొనుక్కున్నారు. అయితే, కరోనా కారణంగా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. ఈ లోపు అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన ఆఫర్ కి నిర్మాతలతో పాటు లక్ష్మణ్ కూడా అటు వైపే మొగ్గు చూపాడు. కానీ ఇప్పటికే తెలంగాణ థియేటర్ల సంఘం ఎవరైతే అక్టోబర్ లోపు తమ సినిమాలను ఓటీటీకి ఇస్తారో వారిని ఎంకరేజ్ చెయ్యమని స్పష్టం చేసింది.

ఐతే, తమ మనిషిగా భావించిన లక్ష్మణ్ ‘టక్ జగదీష్’ విషయంలో ఇలా చేసే సరికి థియేటర్ల సంఘం అతని పై గుర్రుగా ఉంది. మరోపక్క దిల్ రాజు వరుసగా ‘పాగల్’, ‘సీటిమార్’ వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. థియేటర్ల సంఘానికి దగ్గర అయ్యాడు. దాంతో డిస్ట్రిబ్యూషన్ లో దిల్ రాజు మళ్ళీ పట్టు సాధించాడు. లక్ష్మణ్ మాత్రం తనకున్న బలాన్ని బలహీనతగా మార్చుకున్నాడు. మొత్తానికి లక్ష్మణ్ పొరపాటు దిల్ రాజుకి బలమైంది.