https://oktelugu.com/

YS Jagan: జగన్ పై అంత వ్యతిరేకత ఉందా?

YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. మీడియా ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఎల్లో మీడియా అయితే జగన్ (Jagan) పై లేనిపోని బురదలు చల్లుతూ పార్టీ ప్రతిష్ట దిగజారిందంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ అనిశ్చితిపై పలు విధాలైన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పై వ్యతిరేకత పెరుగుతోందంటూ పనిగట్టుకుని మరీ పుకార్లు సృష్టిస్తోంది. రాజకీయాలంటేనే అవినీతితో కూడుకున్నవని […]

Written By: , Updated On : August 27, 2021 / 09:58 AM IST
Follow us on

CM JaganYS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. మీడియా ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేస్తోంది. ఎల్లో మీడియా అయితే జగన్ (Jagan) పై లేనిపోని బురదలు చల్లుతూ పార్టీ ప్రతిష్ట దిగజారిందంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ అనిశ్చితిపై పలు విధాలైన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పై వ్యతిరేకత పెరుగుతోందంటూ పనిగట్టుకుని మరీ పుకార్లు సృష్టిస్తోంది. రాజకీయాలంటేనే అవినీతితో కూడుకున్నవని ప్రజల అభిప్రాయం. అందులో ఉండేవారెవరు కూడా నిజాయితీ పరులు కాదని తెలుసుకున్నారు. అందుకే జగన్ పై అన్ని రకాల ఆరోపణలు వచ్చినా ఆయనకు రాజకీయంగా అధికారం కట్టబెట్టడం తెలిసిందే . తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైసీపీపై లేనిపోని ప్రచారాలు చేస్తోంది.

ఇటీవల కాలంలో ఏపీలో ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోంది. ఇది ప్రతిపక్షాలకు కలిసివస్తోంది. రాష్ర్ట ప్రభుత్వ తప్పిదాలను భూతద్దాల్లో చూపిస్తూ లబ్ధిపొందాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ర్ట పరిస్థితి అధ్వానంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇంకా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు వంటి స్టేట్లలో కూడా ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినా అక్కడి ప్రతిపక్షాలు ఇలా చేయడం లేదు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి టీడీపీ హయాం నుంచే అధోముఖ స్థానానికి చేరడం ప్రారంభమైంది. వైసీపీ కాలంలో ఇది మరింత రెట్టింపయింది. కానీ వైసీపీ వల్లే ఆర్థిక స్థితి దిగజారిపోయిందని టీడీపీ దుమ్మెత్తిపోస్తోంది.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కోల్పోతున్నారంటూ మీడియాలు హైలెట్ చేస్తున్నాయి. ఇండియా టుడే, ఎల్లో మీడియాలు జగన్ పై అనవసర ఆరోపణలు చేస్తూ పార్టీ ప్రతిష్ట మసకబారిందంటూ కథనాలు వెలువరిస్తన్నాయి. ఇటీవల కాలంలో స్థానిక ఎన్నికల్లో పార్టీ రికార్డు స్థాయిలో తన బలాన్ని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కావాలనే లేనిపోని విషయాలు ప్రజలను పక్కదారి పట్టించేందుకు కపట నాటకాలు ఆడుతోందని తెలుస్తోంది. సర్వేలెన్ని చెప్పినా వైసీపీకి మాత్రం ఎదురులేదనే విషయం తెలుసుకుని ప్రతిపక్షాలు ఇలాంటి చౌకబారు విషయాలపై దృష్టి పెడుతున్నాయనేది నిర్వివాదాంశం.

దేశంలోని చాలా స్టేట్లలో ప్రతిపక్షాలు అధికార పక్షంతో కలిసిన సందర్భాలు ఎక్కువగానే ఉన్నాయి. బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ, తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు ప్రజామోద విషయాల్లో కలిసి నడుస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ఏ కార్యక్రమంపైనైనా టీడీపీ కలిసి రావడం లేదు. అన్నిటికి వైసీపీని తిట్టిపోయడమే పనిగా పెట్టుకుంది. దీంతో రాజకీయ అనిశ్చితి పెరుగతోందని తెలుస్తోంది. ఈ సంప్రదాయం పోవాలి. పార్టీల్లో పరస్పరం సహకరించుకునే ధోరణి పెరగాలి. అప్పుడే పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారే సూచనలు కనిపించవనే విషయాలను గుర్తించుకోవాలి.