పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి తన నిరసన గళం వినిపించారు. తమ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కేంద్రానికి పంపించేది లేదంటూ ఆమె మోదీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. గత శుక్రవారం యాస్ తుఫాను పై మోదీతో జరిగిన సమావేశానికి మమత హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అలాపన్ బంద్యోపాధ్యాయ్ ను వెంటనే ఢిల్లీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఆయన సోమవారం ఉదయం 10 గంటలలోపే అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంది.