సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల పరిస్థితి గురించి, వారి పై జరిగే లైంగిక దాడులు గురించి ఇప్పటికే ఎందరో బాధితులు విన్న వరికి కన్నీళ్ళు వచ్చేలా విన్నవించారు. అయితే ఇక్కడ ఇంకో దౌర్భాగ్యం ఏమిటంటే.. అమ్మాయిలకు గౌరవం ఇచ్చే వ్యక్తుల పై ఇలాంటి ఆరోపణలు, అనుమానాలు రావడం. ప్రతి మహిళనూ నోరారా ‘అమ్మా’ అని సంబోధిస్తూ మహిళలను గౌరవిస్తూ ఉంటాడు హీరో విశాల్.
అలాంటి విశాల్ పై తమిళనాడుకు చెందిన గాయత్రి రఘురామ్ అనే కొరియోగ్రాఫర్ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ ఈమె ఇప్పుడు సడెన్ గా ఎందుకు ఆరోపణలకు దిగింది అంటే.. రీసెంట్ గా భాజపాలోకి చేరింది లేండి. రాజకీయ నాయకురాలు అయింది కాబట్టి, తాజాగా ట్విటర్ వేదికగా విరుచుకుపడింది. తమిళనాడులోని ఓ స్కూల్ లో విద్యార్థినిపై జరిగిన ఓ అమానుష దుశ్చర్యను ఖండిస్తూ విశాల్ ట్వీట్ చేశాడు.
విశాల్ లోనూ రాజకీయ నాయకుడు ఉన్నాడు కాబట్టి, ఇలాంటివి జరిగినప్పుడు సరదాగా ట్వీట్ చేయడం విశాల్ కి అలవాటు. ఆ అలవాటులో భాగంగా విశాల్ స్పందించాడు. విశాల్ ట్వీట్ చూసిన గాయత్రి రెచ్చిపోయి మరీ ట్వీట్ పెట్టింది. ‘సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీరు లైంగిక దాడులను ఖండించడమే కాదు, వాటికి దూరంగా ఉండండి. మీ అవసరాల కోసం అమ్మాయిలను వాడుకుని చివరికి వాళ్లని అవతలకి విసిరిపారేయడం నిజం కాదా ? ! మీ లాంటి వారి వల్ల ఎంతో మంది అమ్మాయిలు మోసపోయారు. అలాగే మీ వేధింపుల కారణంగా ఎంతోమంది హీరోయిన్స్ పారిపోయారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు.
ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా. మీరు సినిమాల్లో చూపించే హీరోయిజమ్, నిజ జీవితంలో కూడా చూపిస్తే సినిమా పరిశ్రమలో ఇబ్బందులు పడుతున్న అమ్మాయిలకు గొప్ప ఊరటగా ఉండేది’’ అంటూ విశాల్ ను ట్యాగ్ చేసి గాయత్రి ఈ ట్వీట్ వార్ ను ప్రకటించింది. మొత్తానికి ఇప్పుడు ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఈ ట్వీట్ వార్ పై విశాల్ యుద్ధాన్ని ప్రకటించలేదు.