https://oktelugu.com/

యువతకు జగన్ గొప్ప వరం

ఏపీలో వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా సీఎం ఓ శుభవార్త అందించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లను రూపొందించాలని సంబంధిత శాఖను ఆదేశించారు. దీనికి అవసరమైన పాలనాపరమైన అనుమతులు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కు అప్పగించింది. సంబంధిత ఉత్తర్వులను మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మివిడుదల […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 31, 2021 / 11:14 AM IST
    Follow us on

    ఏపీలో వైఎస్ జగన్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా సీఎం ఓ శుభవార్త అందించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లను రూపొందించాలని సంబంధిత శాఖను ఆదేశించారు.

    దీనికి అవసరమైన పాలనాపరమైన అనుమతులు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ కు అప్పగించింది. సంబంధిత ఉత్తర్వులను మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మివిడుదల చేశారు. రాష్ర్టంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలున్నాయి. ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంలో కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    దేశంలోని అన్ని రాష్ర్టాల్లో కొత్తగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చిను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఒక్కో నైపుణ్యాభివృద్ధి కళాశాలలో ఆరు తరగతి గదులు, రెండు ల్యాబొరేటరీలు, ఒక వర్క్ షాప్ ఉన్నాయి. ఒకే సారి 240 మందికి శిక్షణ ఇచ్చేలా వాటిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇందులో 120 మందికి రెసిడెన్సియల్ సదుపాయాన్ని కల్పించింది. నాన్ రెసిడెన్సియల్ కింద మరో 120 మంది విద్యార్థులు శిక్షణ పొందే వీలుంటుంది.

    ఒక్కో స్కిల్ కళాశాలకు ప్రభుత్వం రూ.20 కోట్లు గ్యాపెక్స్ ఫండ్ విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా పరిశ్రమలు, పారిశ్రామిక అసోసియేన్లతో లింకప్ అయ్యే ఏర్పాటు చేసింది. దీంతో ఆయా పరిశ్రమలు, అసోసియేషన్ల ప్రతినిధులు యువతకు ప్రాక్టికల్స్ లో శిక్షణ ఇచ్చే అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌషల్ యోజన, ప్రధానమంత్రి కౌషల్ యోజన పథకాలతో ఈ కాలేజీలను అనుసంధానం చేస్తోంది.