
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు రచించబోనని ఆయన తెలిపారు. ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.