
తాను రాజకీయాల్లోకి రావట్లేదని అగ్రకథానాయకుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి స్పష్టం చేశారు. తాజాగా రజనీ మక్కళ్ మండ్రం నిర్వహకులతో భేటీ అయ్యారు. సోమవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఈ సమావేశం జరిగింది. అనంతరం పోయెస్ గార్డెన్ లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేనే అమెరికా వెళ్లొచ్చాను. భవిష్యత్తులో నేనే రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు. అయితే నేనే రాజకీయాల్లోకి రావట్లేదు. మక్కళ్ మండ్రంను రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో రజనీ అభిమాన సంక్షేమ మండ్రం ఏర్పాటు చేస్తున్నాను అని రజనీ ప్రకటించారు.