https://oktelugu.com/

Taj Banjara hotel : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్ తాజ్ బంజారా హోటల్ సీజ్.. కారణం ఏంటంటే..

Taj Banjara hotel ఇప్పుడంటే హైదరాబాదులో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు వచ్చాయి. ఆతిధ్యరంగంలో సరికొత్త సేవలు అందిస్తున్నాయి.. ప్రపంచ స్థాయిలో వసతి కల్పిస్తూ పర్యటకులకు, అతిధులకు అదిరిపోయే హాస్పిటలాటిని పరిచయం చేస్తున్నాయి.

Written By: , Updated On : February 21, 2025 / 10:57 AM IST
Follow us on

Taj Banjara hotel  హైదరాబాద్ కు ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు రాకముందు..పార్క్ హయత్, నోవాటెల్, దసపల్లా వంటి హోటళ్లు నిర్మాణం కాకముందు.. హైదరాబాద్ కు స్టేటస్ సింబల్ గా తాజ్ బంజారా(Taj Banjara) ఉండేది. బంజారాహిల్స్ – జూబ్లీహిల్స్ మధ్యలో ఈ హోటల్ ఉండేది. హైదరాబాద్ నగరానికి వచ్చే గొప్ప గొప్ప అతిథులకు.. పర్యటకులకు ఈ హోటల్ విడిది కేంద్రంగా ఉండేది. ఇందులో ప్రపంచ స్థాయి వంటకాలు లభించేవి. ఆతిధ్యం కూడా అద్భుతంగా ఉండేది. సెంట్రల్ ఏసి, బార్, పబ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. అందువల్లే ఈ హోటల్లో విడిది చేసేందుకు ప్రపంచ స్థాయి అతిథులు, పర్యాటకులు ఇష్టపడేవారు. సినిమాల్లోనూ తాజ్ బంజారా హోటల్ ను ప్రముఖంగా చూపించేవారు. తాజ్ బంజారా హోటల్లో విడిది చేయడాన్ని స్టేటస్ సింబల్ గా పేర్కొనేవారు. అయితే గతం ఎంతో ఘనం అన్నట్టుగా.. తాజ్ బంజారా హోటల్ పరిస్థితి మారిపోయింది. ఈ హోటల్ నిర్వాహకులు ఆస్తి పన్ను కట్టకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(greater Hyderabad municipal corporation) అధికారులు సీజ్ చేశారు.

శుక్రవారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాజ్ బంజరా హోటల్ కు తాళం వేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 1.43 కోట్ల ఆస్తి పన్ను తాజ్ బంజరా హోటల్, చెల్లించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తాళం వేశారు. గత రెండు సంవత్సరాల నుంచి తాజ్ బంజరా హోటల్ నిర్వాహకులు ఆస్తి పన్ను చెల్లించడం లేదు. ఆస్తి పన్ను చెల్లించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన ఇప్పటికీ యాజమాన్యం స్పందించలేదు.. వాస్తవానికి తాజ్ గ్రూపునకు చెందిన హోటల్ ఆస్తిపన్ను చెల్లించకపోవడాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీవ్రంగా పరిగణించింది. అయితే ఈ హోటల్ ప్రాపర్టీ జీవీకే గ్రూప్ (GVK group) నకు చెందినదని తెలుస్తోంది. మరోవైపు తాజ్ – జీవీకే మధ్య లీజ్ ఒప్పందం కూడా ముగిసిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాదికాలంగా ఈ హోటల్ నడవడం లేదని తెలుస్తోంది. లీజ్ ఒప్పందం ముగియడంతో జీవికి గ్రూప్ ఈ హోటల్ నిర్వహణ నుంచి నిష్క్రమించినట్టు తెలుస్తోంది.. అందువల్లే ఏడాదికాలంగా హోటల్ మూతపడి ఉందని తెలుస్తోంది. జీవీకే గ్రూప్ తప్పుకోవడంతో అన్ని రోజుల పాటు హోటల్లో పనిచేసిన సిబ్బంది వేరే దారులు చూసుకున్నట్టు తెలుస్తోంది. చెఫ్ లు ఇతర హోటల్స్ లో చేరిపోయారని.. సిబ్బంది వేరే కంపెనీలలో కొలువులు చూసుకున్నారని సమాచారం. ఎన్ని మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ తాజ్ హోటల్ గ్రూప్ యాజమాన్యం స్పందించకపోవడంతో.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం ఉదయం సిబ్బందితో కలిసి వెళ్లి తాజ్ బంజారా హోటల్ గేట్ కు తాళం వేశారు.. అయితే తాజ్ బంజారా హోటల్ ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో.. తాళం వేశారని మీడియాలో వార్తలు రావడం సంచలనాన్ని కలిగిస్తోంది.