
పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా శుక్రవారం ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తామన్నారు. నిర్బంధించాలని చూస్తే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామన్నారు. ఎన్ని జైల్లో, ఎన్ని స్టేషన్లో పెడతారో చేస్తామన్నారు.