Horoscope Today: 2024 ఏప్రిల్ 21 ఆదివారం రోజున ద్వాదశ రాశులపై ఉత్తర పాల్ఘుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్య రాశిలో సంచరించనున్నాడు. దీంతో మీన రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. కొన్ని రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈ రాశివారు సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ధైర్యంగా ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒత్తిడితో ఉంటారు. వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ప్రశాంత జీవితాన్ని గడపాలి. మానసికంగా ధృఢంగా ఉంటారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మిథునం:
ఉద్యోగులకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
కర్కాటకం:
కొన్ని రంగాల వారు ఉన్నత స్థితికి చేరుతారు. సంపద పెరుగుతుంది. ఇదే స్థాయిలో ఖర్చులు పెరుగుతాయి. ఊహించని అనుభవాన్ని ఎదుర్కొంటారు.
సింహ:
తక్కువగా మాట్లాడడం మంచిది. పాత కోరికలను నెరవేర్చుకుంటారు. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ లోపం ఏర్పడుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి.
కన్య:
కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపారానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఆర్తిక పరిస్థితి మెరుగుపడుతుంది.
తుల:
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటలతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి.
వృశ్చికం:
స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రతగా ఉండాలి. ఆదాయం, వ్యయం బ్యాలెన్స్ గా ఉంటుంది. పనిలో పురోగతి లభిస్తుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
ధనస్సు:
వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. అనవసర వాదనలకు దిగకుండా ఉండాలి.
మకర:
స్నేహితులతో సరదాగా గడుపుతారు. అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి.
కుంభం:
భవిష్యత్ లో విజయాలు సాధించడానికి మార్గం ఏర్పడుతుంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెరపాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయిస్తారు.
మీనం:
అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. విద్యార్థులు కెరీర్ కు సంబంధించి ఆలోచన చేస్తారు.