DC vs SRH : ఇది సన్ రైజర్స్ నామ ఐపీఎల్.. రికార్డులను ఏ రేంజ్ లో మడత పెడుతోందంటే..

ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. అతడు 142 మ్యాచులలో 357 సిక్సర్లు కొట్టాడు. 4,965 పరుగులు చేశాడు. ముంబై ఆటగాడు రోహిత్ శర్మ 275 సిక్సర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఎబి డివిలియర్స్ 251, విరాట్ కోహ్లీ 248, ధోని 247, డేవిడ్ వార్నర్ 236, కీరన్ పొలార్డ్ 223, రసెల్ 203, సురేష్ రైనా 203, సంజు సాంసన్ 193, షేన్ వాట్సన్ 190, రాబిన్ ఊతప్ప 182, రాహుల్ 179, అంబటి రాయుడు 173, బట్లర్ 159 సిక్సర్లు కొట్టారు.

Written By: NARESH, Updated On : April 20, 2024 10:35 pm

Sunrisers Hyderabad's huge scores in IPL 2024.. Sixers' records

Follow us on

DC vs SRH :డౌటే లేదు.. సందేహం అస్సలక్కర్లేదు. అనుమానం చెందాల్సిన అవసరం లేదు..ఈ ఐపీఎల్ హైదరాబాద్ రికార్డులను సరికొత్తగా మడత పెడుతోంది. ముంబై జట్టుపై 277.. బెంగళూరు పై 287 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన హైదరాబాద్.. మిగతా విభాగాల్లోనూ సత్తా చాటుతోంది. బెంగళూరు, ముంబై జట్లు మాత్రమే కాదు.. శనివారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో తొలి పవర్ ప్లే లో 20 కి పైగా రేట్ తో హైదరాబాద్ ఏకంగా 125 రన్స్ చేసింది. ఇంతటి విధ్వంసంలో 13 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్ల రూపంలో హైదరాబాద్ జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందిస్తున్నారు. హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.. ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, మార్క రంఅత్యంత కీలకంగా మారారు. ఈ నలుగురు తుఫాన్ ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి జట్లను వణికిస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, మార్క్రం తుఫాన్ లాంటి బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు.

ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఏకంగా 99 సిక్సర్లు నమోదు చేసింది. ముంబై జట్టుపై జరిగిన మ్యాచ్లో 277 పరుగులు చేసిన హైదరాబాద్.. 18 సిక్సర్లు కొట్టింది. బెంగళూరు పై 287 పరుగులు చేసి.. 22 సిక్స్ లు బాదింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 22 సిక్స్ లు కొట్టేసింది. ఇలా ఈ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ ఆటగాళ్లు 99 సిక్సర్లు బాదారు. హైదరాబాద్ జట్టు జోరు ఇలాగే కొనసాగితే ముంబై రికార్డు బ్రేక్ చేయడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ 24 సిక్సర్లు కొట్టి మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. కోల్ కతా ఆటగాడు సునీల్ నరైన్ 20, లక్నో ఆటగాడు నికోలస్ పూరన్ 20, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ 20, హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ 18, బెంగళూరు ఆటగాడు దినేష్ కార్తీక్ 18, ముంబై ఆటగాడు రోహిత్ శర్మ 18 సిక్సర్లతో కొనసాగుతున్నారు.