Horoscope Today: 2024 ఏప్రిల్ 11 గురువారం రోజున ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు మిథున రాశివారు అాధిక లాభాలు పొందుతారు. కర్కాటక రాశివారు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఉద్యోగులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. చట్టపరమైన విషయాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి.
వృషభ రాశి:
ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
మిథునం:
వ్యాపారులు లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఆఫర్లు వదులుకోవద్దు.
కర్కాటకం:
ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు.
సింహ:
ఏ పనిచేసినా అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఓ బాధ్యతను చక్కగా నెరవేరుస్తారు. గతంలో కంటే ఆరోగ్యం బాగుంటుంది.
కన్య:
సీనియర్ల నుంచి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఖర్చులు నియంత్రించాలి.
తుల:
ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రతిభ పదిమందికి తెలుస్తుంది. కొన్ిన విషయాల్లో ధైర్యం పెరుగుతుంది. ఎక్కువగా వాదనలు చేయొద్దు.
వృశ్చికం:
సన్నిహితులతో అనుబంధం పెంచుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి.
ధనస్సు:
కొత్త పరిచయాలు లాభిస్తాయి. వ్యాపారంలో కొన్ని ప్రణాళిలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగులు ఆహ్లదకరమైన వాతావరణంలో కొనసాగుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది.
మకర:
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ పనికి ఆటంకం కలిగించేవారు మీ పక్కనే ఉంటారు. పెట్టుబడి విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.
కుంభం:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. రావాల్సిన బకాయిలు విడుదల అవుతాయి. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిగా మద్దతు ఉంటుంది.
మీనం:
పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. ఎవరనీ గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థికంగా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.