Horoscope Today: 2024 ఏప్రిల్ 19 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచరించనున్నాడు. దీంతో తులా రాశి వారికి అదనంగా డబ్బు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
కొన్ని లక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆస్తి సంబంధిత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
మిథునం:
ఆర్థికపరంగా బాగుంటుంది. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.
కర్కాటకం:
వైశాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాలి. లేకుంటే సమస్యలు వస్తాయి.
సింహ:
లక్ష్యం కోసం ప్రణాళికలు వేస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి. విద్యారంగానికి చెందిన వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంగా బాగుంటుంది.
కన్య:
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కొన్ని విషయాల్లో బాధ్యతతో ఉండాలి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
తుల:
అదనండా డబ్బు వచ్చి చేరుతుంది. ఆస్తిని కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ప్రతీ పనిని పూర్తి చేసేందుకు ప్రణాలికలు వేసుకోవాలి.
వృశ్చికం:
ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడుతాయి. ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ధనస్సు:
మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. డబ్బుకు సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు.
మకర:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనవసర వాదనలకు దిగొద్దు. వ్యాపారం కోసం కొత్త ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ కోసం కష్టపడుతారు.
కుంభం:
కెరీర్ కు సంబంధించి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగం పురోగతి సాధిస్తుంది. సాయంత్రం ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి.
మీనం:
ఉద్యోగులు కొన్ని విషయాల్లో బిజీగా ఉంటారు. కొన్ని శుభవార్తలు వింటారు. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆహ్లదంగా ఉంటారు.