హోంగార్డు ప్రదీప్ పట్టపగలే పీకలదాకా మద్యం సేవించి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. తాగిన మత్తులో రోడ్డుపై వచ్చిన వాహనాలను ఆపుతూ నానా హంగామా చేశాడు. ఉత్తరప్రదేశ్ లో అసలే ఎండలు మండిపోతున్నాయి. మిట్ట మధ్యాహ్నం సమయంలో రోడ్డుపైకి వచ్చిన ఓ బస్సును హోంగార్డు ఆపడంతో జనాల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే హోంగార్డు పై జనం మూకుమ్ముడి దాడికి పాల్పడ్డారు. దగ్గరలోనే విధుల నిర్వహిస్తున్న పోలీసులు హోంగార్డును జనాల నుంచి కాపాడారు.