
నారదా కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ సందర్భంగా వ్యవహరించిన తీరుపై సమాధానం ఇచ్చేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఇచ్చిన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయనందుకుగానూ దీదీ, బెంగాల్ ప్రభుత్వానికి రూ. 5వేల జరిమానా విధించింది. నారదా కుంభకోణానికి సంబంధించి ఇద్దరు మంత్రులు సహా నలుగురు నాయకులను మే 17న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.